అఖిల‌ప్రియ సెంటిమెంట్  మజాకా …శిల్పా సవాల్ మజాకా ……నంద్యాల ఎన్నికలు

Nandyala

నంద్యాలలో ఇక ఉంటే భూమా కుటుంబం…లేదంటే శిల్పా ఫ్యామిలీల్లో ఒక్క‌రే ఉండ‌నున్నారు. ..? ఎన్నిక‌ల త‌రువాత ఎదో ఒక ఫ్యామిలీ నంద్యాల‌ను వ‌దిలేసి వెళ్లిపోనున్నారు…?  ఇదేంటి అనుకుంటున్నారా …?  నిజ‌మే. ఈ విష‌యాన్ని ఎవ‌రో చెప్ప‌డం కాదు. సాక్షాత్తూ భూమా అఖిల‌ప్రియ‌…శిల్పా మోహ‌న్ రెడ్డిలే బ‌స్తీమే స‌వాల్ అంటూ ఛాటిచెప్పారు. నంద్యాల ఎన్నిక‌ల అభ్య‌ర్థుల‌పై క్లారిటీ వ‌చ్చేసింది. టీడీపీ అభ్య‌ర్థిగా భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిని ఖ‌రారు చేయ‌గా, వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా క్లారిటీ ఇచ్చేశారు. టీడీపీకి షాక్ ఇచ్చే రేంజ్ లో శిల్పా మోహ‌న్ రెడ్డిని అభ్య‌ర్థిగా డిసైడ్ చేశారు.

శిల్పా మోహ‌న్ రెడ్డి అభ్య‌ర్థి అన‌గా భూమా అఖిల‌ప్రియ ఓట‌మి భ‌యంతో సెంటిమెంట్ పండించేందుకు ప్ర‌య‌త్నాలు ఆరంభించారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో బ్ర‌హ్మానంద‌రెడ్డి గెలుస్తార‌ని, ఓడిపోతే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. బ‌య‌ట‌కు ఇది స‌వాల్ లా క‌నిపించినా, జ‌నానికి భూమా అఖిల‌ప్రియ పెట్టిన సెంటిమెంట్  టెస్ట్. మంత్రి ప‌ద‌వి పోతుందేమో..?  రాజ‌కీయంగా అన్యాయం జ‌రిగిపొద్దేమో..? అన్న సానుభూతి జ‌నంలో క‌లిగించేందుకు అఖిల‌ప్రియ ఈ రాజీనామా మంత్రాన్ని వాడారు.

దీనిని ప‌సిగ‌ట్టిన శిల్పా మోహ‌న్ రెడ్డి కూడా అంతే స్ట్రాంగ్ క‌మిట్ మెంట్ ను ప్ర‌ద‌ర్శించారు. తాను నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఒక‌వేళ ఓడిపోతే శాశ్వ‌తంగా రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో నంద్యాల రాజ‌కీయం భూమా వ‌ర్సెస్ శిల్పా కుటుంబాల్లో ఎలిమినేష‌న్ కు వేదిక కానుంది. ఉప ఎన్నిక‌ల త‌రువాత నంద్యాల‌లో ఇద్ద‌రిలో ఎవ‌రిదో ఒక‌రి ఫ్యామిలీనే ఉండ‌బోతుంద‌న్న‌మాట‌.