ఓరినాయనో కెమెరాలు ఎవడ్రా ఇక్కడ పెట్టింది… నేను పెట్టమంది బిగ్ బాస్  హౌస్ లో నా హౌస్ లో కాదు… మార్చండి త్వరగా

అంటూ ఎన్టీఆర్ తన డైన శైలి లో అందర్నీ ఆకర్షించారు.బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అయి ఏళ్ల తరబడి ప్రసారమవుతోన్న ‘బిగ్‌ బాస్‌’ షో ఇప్పుడు దక్షిణాదికి వచ్చింది. తమిళంలో దీనికి హోస్ట్‌గా కమల్‌హాసన్‌ వ్యవహరిస్తుంటే, తెలుగు షోకి ఎన్టీఆర్‌ హోస్ట్‌గా చేస్తున్నాడు. ఇంకా తెలుగు బిగ్‌బాస్‌ ప్రసారం మొదలు కాలేదు కానీ ముందుగా కమల్‌ బిగ్‌బాస్‌ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.షో ప్రారంభం కాకముందే ప్రోమో తో నే ఎన్టీఆర్ అందరిలో ఉత్కంఠ ని పెంచాడు.